సాంబార్‌

ABN , First Publish Date - 2015-12-14T20:09:39+05:30 IST

కావలసిన పదార్థాలు : కందిపప్పు-30గ్రా, పెసరపప్పు-20గ్రా, సొరకాయ-పావుభాగం, బెల్లం-50గ్రా, చింతపండు-20గ్రా, డాల్డా-35గ్రా, నెయ్యి-25గ్రా, టొమాటో-50గ్రా,

సాంబార్‌

కావలసిన పదార్థాలు : కందిపప్పు-30గ్రా, పెసరపప్పు-20గ్రా, సొరకాయ-పావుభాగం, బెల్లం-50గ్రా, చింతపండు-20గ్రా, డాల్డా-35గ్రా, నెయ్యి-25గ్రా, టొమాటో-50గ్రా, ఉల్లిపాయలు-70గ్రా, రెడ్‌ చిల్లీ-5, పసుపు-తగినంత, కళ్లు ఉప్పు-తగినంత, కొత్తిమీర-100గ్రా, మంచినీళ్లు-1లీటరు, కరివేపాకు-ఒక కాడ.
సాంబార్‌ మసాలా కోసం : జీలకర్ర-5గ్రా, నువ్వులు-20గ్రా, పచ్చిశనగపప్పు-60గ్రా, ఎండుమిర్చి-10గ్రా, వెల్లుల్లి-సగం పాయ, పచ్చికొబ్బరి తురుము-1 కప్పు, మెంతులు-1 టీస్పూన్‌, మినప్పప్పు-5గ్రా, మిరియాలు-5గ్రా, ధనియాలు-20 గ్రా, ఇంగువ పేస్ట్‌-అర టీస్పూన్‌.
తయారుచేయు విధానం : ముందుగా కందిపప్పు, సొరకాయ ముక్కలను కుక్కర్‌లో మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌పై బాణలి ఉంచి, అందులో కొద్దిగా నూనె వేసి, సాంబార్‌ మసాలా దినుసులన్నీ వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత వాటన్నింటినీ మిక్సీలో వేసి, కాసిని నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండు, బెల్లం కాసిని నీళ్లల్లో నానబెట్టి ఉంచుకోవాలి. స్టవ్‌పై బాణలి ఉంచి, అందులో కొద్దిగా డాల్డా వేసి, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి, అవి మాడిపోక ముందే టొమాటో, ఎండు మిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తర్వాత అందులో చింతపండు పులుసు పోసి, పసుపు, కళ్లు ఉప్పు వేసి, ఆపైన నానబెట్టి ఉంచి బెల్లం, నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమానికి లీటరు మంచినీళ్లు చేర్చి కాసేపు మరగనివ్వాలి. కాస్త మరిగిన తర్వాత సాంబార్‌ మసాలా పేస్ట్‌ కూడా ఇందులో వేసి కలపాలి. మరో పది నిమిషాలు మరిగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, సొరకాయ ముక్కలను మెత్తగా చేసి ఇందులో కలపాలి. సాంబార్‌ కాస్త తీయగా ఉండాలనుకునే వారు కొంచెం పంచదార కలుపుకోవచ్చు. ఇలా 15-20 నిమిషాలపాటు మరగనిస్తే సాంబారు కొద్దిగా చిక్కబడుతుంది. ఆఖరున కొత్తిమీర ఆకులు, నెయ్యి వేసి కాసేపు ఉడికించి దింపేయాలి. అంతే ఘుమఘుమలాడే సాంబార్‌ రెడీ అయినట్లే!

Updated Date - 2015-12-14T20:09:39+05:30 IST