క్యాబేజి పచ్చడి

ABN , First Publish Date - 2015-11-22T16:16:11+05:30 IST

కావాల్సినపదార్థాలు: క్యాబేజి తురుము - రెండు కప్పులు, పచ్చిమిరపకాయలు - ఐదు, పల్లీలు - ఒక కప్పు, ఎండు మిరపకాయలు - నాలుగు, జీలకర్ర - అర టీ స్పూను, జీలకర్ర -

క్యాబేజి పచ్చడి

కావాల్సిన పదార్థాలు: క్యాబేజి తురుము - రెండు కప్పులు, పచ్చిమిరపకాయలు - ఐదు, పల్లీలు - ఒక కప్పు, ఎండు మిరపకాయలు - నాలుగు, జీలకర్ర - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - తగినంత, కరివేపాకు - రెండు రెబ్బలు, మినపప్పు - టీ స్పూను.
తయారుచేయువిధానం: ముందుగా స్టౌ మీద కడాయి పెట్టి పల్లీలు, ఎండు మిరపకయాలు వేసి వేయించుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాబేజి తురుము వేయించాలి. పసుపు, ఉప్పు కూడా వేసి బాగా మగ్గనవివ్వాలి. ఇందులో పల్లీల పొడి కూడా వేసి బాగా కలిపి రోట్లో రుబ్బుకోవాలి. కొద్దిగా ముక్కలు ఉండేట్టు రుబ్బుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టౌ మీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి కాగాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి ఇందులో పచ్చడిని కలుపుకోవాలి.

Updated Date - 2015-11-22T16:16:11+05:30 IST