సాంబారుపొడి

ABN , First Publish Date - 2015-12-03T16:17:32+05:30 IST

కావాల్సినపదార్థాలు: శెనగపప్పు - రెండు టేబుల్‌ స్పూన్లు, ఎండుమిరిపకాయలు - 5, ధనియాలు - ఒక టేబుల్‌ స్పూను, జీలకర్ర - ఒక టీ స్పూను, ఇంగువ - కొద్దిగా, మెంతులు

సాంబారుపొడి

కావాల్సినపదార్థాలు: శెనగపప్పు - రెండు టేబుల్‌ స్పూన్లు, ఎండుమిరిపకాయలు - 5, ధనియాలు - ఒక టేబుల్‌ స్పూను, జీలకర్ర - ఒక టీ స్పూను, ఇంగువ - కొద్దిగా, మెంతులు - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - తగినంత, పసుపు - అర టీ స్పూను.
తయారుచేయు విధానం: స్టౌ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి శెనగపప్పు దోరగా వేయించాలి. తరువాత మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ, ఎండు మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. వీటిని చల్లారనిచ్చి తగినంత ఉప్పు, పసుపు వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.

Updated Date - 2015-12-03T16:17:32+05:30 IST