బాదం పప్పు డ్రై ప్రూట్స్‌

ABN , First Publish Date - 2015-11-22T15:16:58+05:30 IST

కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు - ఒక కప్పు, డార్క్‌ బ్రౌన్‌ షుగర్‌ - ఒక కప్పు, బటర్‌స్కాచ్‌ చిప్స్‌ - పావు కప్పు, ఉప్పు - కొద్దిగా.

బాదం పప్పు డ్రై ప్రూట్స్‌

కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు - ఒక కప్పు, డార్క్‌ బ్రౌన్‌ షుగర్‌ - ఒక కప్పు, బటర్‌స్కాచ్‌ చిప్స్‌ - పావు కప్పు, ఉప్పు - కొద్దిగా.
తయారుచేయు విధానం: ముందుగా బాదం పప్పుని సన్నటి మంటపై దోరగా వేగించాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి డార్క్‌ బ్రౌన్‌ షుగర్‌, అర కప్పు నీళ్లు పోసి మరిగించాలి. తీగ పాకం వచ్చాక దించేయాలి. అందులో వేగించి పెట్టుకున్న బాదం పప్పు, బటర్‌స్కాచ్‌ చిప్స్‌, ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక పళ్లెంలో నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పోయాలి. చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో ముక్కలు చేసుకోవాలి.

Updated Date - 2015-11-22T15:16:58+05:30 IST