వెజిటేరియన్‌ హలీమ్‌

ABN , First Publish Date - 2015-11-02T15:10:33+05:30 IST

కావలసిన పదార్థాలు: క్యారట్‌, బీట్రూట్‌, బీన్స్‌, బంగాళాదుంపలు, పచ్చిబఠాణీ ముక్కలు: ఒక్కోటి అరకప్పు చొప్పున, పచ్చిమిరపకాయ ముక్కలు: రెండు టేబుల్‌ స్పూన్లు, గోధుమరవ్వ: అరకిలో

వెజిటేరియన్‌ హలీమ్‌

కావలసిన పదార్థాలు: క్యారట్‌, బీట్రూట్‌, బీన్స్‌, బంగాళాదుంపలు, పచ్చిబఠాణీ ముక్కలు: ఒక్కోటి అరకప్పు చొప్పున, పచ్చిమిరపకాయ ముక్కలు: రెండు టేబుల్‌ స్పూన్లు, గోధుమరవ్వ: అరకిలో, పిస్తా, బాదం, జీడిపప్పు: అరకప్పు చొప్పున, నెయ్యి: పావుకిలో, మిరియాలు: రెండు స్పూన్లు, యాలకులు: నాలుగు, పసుపు: చిటికెడు, ఉప్పు: తగినంత, పుదీనా ఆకులు: అరకప్పు, నిమ్మకాయలు: నాలుగు, పాలు: కప్పు, అరటిపండు: ఒకటి (చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి)
తయారీ విధానం: ముందుగా కూరగాయ ముక్కల్ని కుక్కర్‌లో ఒకటి లేదా రెండు విజిల్స్‌ వచ్చేంత వరకూ ఉడికించి నీరంతా వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా నెయ్యి వేసి బాదం, పిస్తా, జీడిపప్పులను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మిగతా నెయ్యి వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయముక్కలు, మిరియాలు, యాలకులు, వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉడికించి పెట్టుకున్న కూరగాయల ముక్కలు, గోధుమరవ్వ, పసుపు, ఉప్పు వేసి కొద్దిసేపు వేయించిన తరువాత కొద్దిగా నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. ఇవన్నీ ఉడికిన తరువాత పప్పు గుత్తితో మెత్తగా చేసుకొని వేయించిపెట్టుకున్న జీడిపప్పు, పిస్తా, బాదం జతచేసుకోవాలి. దించేముందు నిమ్మరసం, పుదీనా ఆకులు కలపాలి.

Updated Date - 2015-11-02T15:10:33+05:30 IST