హోంవంటలుచట్నీలుఅదిలాబాద్బంగాళదుంప ఊరగాయ v>కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు - పావుకిలో, ఆవపిండి - 125గ్రాములు, కారం - 125 గ్రాములు, - ఉప్పు - 125గ్రాములు, నూనె - పావుకిలో, మెంతిపిండి - అర టీ స్పూను, చింతపండు - 25 గ్రాములు, పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు.తయారుచేయు విధానం: బంగాళ దుంపల్ని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కనపెట్టుకోవాలి. తరువాత చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పెట్టుకోవాలి. సగం నూనెని కాచి అందులో ఇంగువా వేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, పసుపు వేసి కలిపి బంగాళాదుంప ముక్కల్ని, చింతగుజ్జుని వేసి ఇంగువ వేసిన నూనెని పోస్తూ కలుపుకోవాలి. దీన్ని ఒక గాజుసీసాలో పెట్టి మిగిలిన నూనెని సీసాలో పోసేయ్యాలి. మూడవ రోజున తీసి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళదుంపల ఆవకాయ కూడా నెల రోజుల వరకూ పాడవకుండా ఉంటుంది. సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!