సీతాఫలం కలాఖండ్‌

ABN , First Publish Date - 2015-10-12T14:14:22+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలు- 2 లీటర్లు, నిమ్మరసం- 2 టీ స్పూన్లు, పంచదార- 2 కప్పులు, పిస్తా, బాదం తరుగు-

సీతాఫలం కలాఖండ్‌

కావలసిన పదార్థాలు: పాలు- 2 లీటర్లు, నిమ్మరసం- 2 టీ స్పూన్లు, పంచదార- 2 కప్పులు, పిస్తా, బాదం తరుగు- చెరొక టీ స్పూను, యాలకుల పొడి- 1/2 టీ స్పూను, సీతాఫలం గుజ్జు- 1 కప్పు, నెయ్యి- 1 టీ స్పూను.
తయారీ విధానం: ఒక లీటరు పాలను విడిగా కాచి, మరుగుతుండగా నిమ్మరసం పిండి పాలు విరగొట్టాలి. తరువాత పల్చటి గుడ్డలో వేసి రెండు చివరలూ మెలిపెడుతూ నీరంతా పిండేయాలి. నిమ్మరసం ఏమైనా మిగిలి ఉంటే పోవడానికి పంపు కింద ఉంచి మరోసారి గట్టిగా మెలిపెట్టి పిండేసి కోవా తీసుకోవాలి. ఆ తరువాత మిగిలిన మరో లీటరు పాలను కూడా సగం అయ్యేవరకూ మరిగించి, అందులో ఆ కోవా వేసి ఉడికించాలి. పదార్థం అంచులు గిన్నెను వదిలేస్తూ ఉన్నప్పుడు సీతాఫలం గుజ్జు, పంచదార వేసి కలపాలి. పదార్థం దగ్గర పడేవరకూ గరిటెతో కలుపుతూ ఉడికించి, నెయ్యిరాసిన పళ్ళెంలోకి తీసుకుని ఆరిన తర్వాత ముక్కలు కోసుకోవాలి.

Updated Date - 2015-10-12T14:14:22+05:30 IST