సొరకాయ హల్వా

కావలసిన పదార్థాలు: (లేత) సొరకాయ -1, పంచదార - 1 కప్పు, నెయ్యి - అర కప్పు, కిస్‌మిస్‌ - 10, జీడిపప్పు -10, ఏలకుల పొడి - అర టీ స్పూను, పచ్చకర్పూరం + కుంకుమపువ్వు - కొద్దికొద్దిగా.
తయారుచేసే విధానం: చెక్కుతీసిన సొరకాయని స్టీల్‌ కొబ్బరి కోరాంతో సన్నగా తురుముకోవాలి (స్టీల్‌ కోరాం అయితే తురుము నల్లబడదు. కోరుతున్నప్పుడు సొరకాయ నుండి వచ్చే నీటిని పారబొయ్యకూడదు). తర్వాత కోరులో పంచదారతో పాటు ‘సొరకాయ నీరు’ కూడా పోసి సన్నని సెగమీద నీరంతా ఇంకిపోయేదాకా ఉంచాలి (దాదాపు ఒక గంటన్నర సమయం పడుతుంది). తర్వాత నెయ్యి వేసి అడుగంటకుండా తిప్పుతుండాలి. హల్వా ముద్దలా అయ్యాక (చేతికి అంటుకోరాదు) ఏలకుల పొడి, జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి దించేసి పచ్చకర్పూరం, కుంకుమపువ్వు వేసి మూతపెట్టి పదినిమిషాల తర్వాత ‘సర్వ్‌’ చేయాలి.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుసీసీ రోడ్డుపైనే బీటీ రోడ్డు నిర్మాణంపైకప్పు కూలినా.. పట్టింపు కరువుహెల్మెట్‌ ధరిస్తేనే రోడ్లపైకి అనుమతి : సీఐమూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!కమ్ముకుంటున్న కారుమబ్బులువానాకాలం సాగుకు రైతులు సన్నద్ధంనత్తనడకన బావి నిర్మాణ పనులుతాంసిలో ఈదురు గాలులుమటన్‌ షాపుల వద్ద సండే సందడి
Advertisement
Advertisement