పొద్దు తిరుగుడు పువ్వు హల్వా

ABN , First Publish Date - 2015-09-02T23:39:31+05:30 IST

కావలసిన పదార్థాలు: పొద్దు తిరుగుడు విత్తనాలు - 200 గ్రా, పాలు - 100 మి.లీ, పంచదార - 100 గ్రా,

పొద్దు తిరుగుడు పువ్వు హల్వా

కావలసిన పదార్థాలు: పొద్దు తిరుగుడు విత్తనాలు - 200 గ్రా, పాలు - 100 మి.లీ, పంచదార - 100 గ్రా, యాలకుల పొడి - 5 గ్రా, కుంకుమ పువ్వు - 1 గ్రా, సిల్వర్‌ ఫాయిల్స్‌ - 4, నెయ్యి - 50 గ్రా.
తయారుచేసే విధానం
పొద్దుతిరుగుడు విత్తనాల్ని రాత్రంతా పాలల్లో నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. పంచదారను నీళ్లలో కలిపి సిరప్‌లా తయారుచేసుకోవాలి. దళసరి అడుగున్న పాత్రలో నేతిని వేసి కొద్దిగా వేడి చేసి, పొద్దుతిరుగుడు పేస్ట్‌ని వేసి సన్నని సెగపై 10 నిమిషాలు వేగించాలి. తర్వాత పంచదార సిరప్‌ని వేసి 5 నిమిషాల వరకూ బాగా కలతిప్పాలి. దించేముందు యాలకుల పొడిని, 10 మిల్లీ లీటర్ల నీటిలో కలిపిన కుంకుమపువ్వును వేయాలి. స్విలర్‌ ఫాయిల్స్‌తో అలంకరించి తినండి.

Updated Date - 2015-09-02T23:39:31+05:30 IST