రాడిష్‌ పరాటాలు

ABN , First Publish Date - 2015-09-02T21:58:37+05:30 IST

కావలసిన పదార్థాలు: రాడిష్‌ తరుగు - 2 కప్పులు, ఉల్లిపాయ (తరుగు) - 1, అల్లం తరుగు - 1 టీ స్పూను

రాడిష్‌ పరాటాలు

కావలసిన పదార్థాలు
 
రాడిష్‌ తరుగు - 2 కప్పులు, ఉల్లిపాయ (తరుగు) - 1, అల్లం తరుగు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు, గోధుమపిండి - 2 కప్పులు, పసుపు - పావు టీ స్పూను, కొత్తిమీర తరుగు - గుప్పెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం
 
కడాయిలో కొద్దిగా నూనె వేసి ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేగాక రాడిష్‌ తరుగు, ఉప్పు, పసుపు వేసి మెత్తబడేదాక సన్నని మంటపై వేగించాలి. కొద్దిగా నీరున్నప్పుడే కొత్తిమీర కలిపి దించేసి చల్లారనివ్వాలి. పిండిలో ఒక టేబుల్‌ స్పూను నూనెతో పాటు రాడిష్‌ మిశ్రమం కొద్దికొద్దిగా వేస్తూ ముద్దలా తయారుచేసి అరగంట పక్కనుంచాలి. సమాన భాగాలుగా ఉండలు చేసి పరాటాలు చేసుకుని రెండువైపులా నూనెతో దోరగా కాల్చుకోవాలి. రైతాతో ఈ పరాటాలు ఎంతో బాగుంటాయి.

Updated Date - 2015-09-02T21:58:37+05:30 IST