వాక్కాయ ఊరగాయ

ABN , First Publish Date - 2015-09-02T16:43:12+05:30 IST

కావలసిన పదార్థాలు: వాక్కాయలు - పావుకిలో, ఆవపొడి - పావుకప్పు, ఉప్పు కలపని కారం - పావు కప్పు

వాక్కాయ ఊరగాయ

కావలసిన పదార్థాలు: వాక్కాయలు - పావుకిలో, ఆవపొడి - పావుకప్పు, ఉప్పు కలపని కారం - పావు కప్పు, పసుపు - అర టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 20, నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - 1 టేబుల్‌ స్పూను, నువ్వుల నూనె - అర కప్పు.
తయారుచేసే విధానం: వాక్కాయలు రెండు ముక్కలుగా కోసి, గింజలు తీసి తడి లేకుండా పొడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. తడిలేని పాత్రలో కారం, ఉప్పు, నిమ్మరసం, పసుపు, వెల్లుల్లి రేకలు, ఆవపొడి, వాక్కాయ ముక్కలు, నూనె వేసి బాగా కలిపి జాడీలో పెట్టి, కనీసం 8 గంటలపాటు ఊరబెట్టాలి. తడి తగలకుండా ఉంటే వారం పాటు నిలువ ఉంటుంది. ఈ ఊరగాయని వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నా, పెరుగన్నంలో నంజుకుని తిన్నా బాగుంటుంది.

Updated Date - 2015-09-02T16:43:12+05:30 IST