గాజర్‌ బర్ఫీ

ABN , First Publish Date - 2015-09-01T22:57:11+05:30 IST

కావలసిన పదార్థాలు: కారెట్స్‌ - 250 గ్రా., పంచదార - వంద గ్రా., పాలు - అరలీటరు,

గాజర్‌ బర్ఫీ

కావలసిన పదార్థాలు: కారెట్స్‌ - 250 గ్రా., పంచదార - వంద గ్రా., పాలు - అరలీటరు, యాలకుల పొడి - చిటికెడు, నెయ్యి - పది గ్రా., సిల్వర్‌ ఫాయిల్‌ - 1.
తయారుచేసే విధానం: కారెట్లను శుభ్రంగా కడిగి, తుడిచి సన్నగా కోరుకోవాలి. తురిమిన కేరట్‌ గుజ్జులో పాలుపోసి సన్నటి సెగపైన ఉంచి సగానికి సగమయ్యేంత వరకు ఉడికించాలి. పంచదార వేసి, పాకం పాత్ర అంచులకు అంటుకునేంత వరుకు కలుపుతూ ఉండాలి. దించేముందు యాలకుల పొడి, నెయ్యి వేసి, ఒక నేతిరాసిన పళ్లెంలో సమంగా పరవాలి. చల్లారాక సిల్వర్‌ ఫాయిల్‌తో అలంకరించి, డైమండ్‌ ఆకారంలో బర్ఫీ ముక్కలుగా కోసుకోవాలి. అక్కడక్కడా డ్రై ఫ్రూట్స్‌ని కూడా అలంకరిస్తే బాగుంటుంది.

Updated Date - 2015-09-01T22:57:11+05:30 IST