Abn logo

మేతీపాలక్‌ పరోటా

కావలసిన పదార్థాలు : గోధుమపిండి - 100గ్రా., ఓట్స్‌ (సూపర్‌మార్కెట్లో దొరుకుతాయి) - 100గ్రా., పాలకూర - 100 గ్రా., మెంతికూర - 100 గ్రా., పనీర్‌ - 100గ్రా., పచ్చిమిర్చి - 2, పసుపు - అరస్పూను, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం : ముందుగా పచ్చిమిర్చి, పాలకూర, మెంతికూరల్ని సన్నగా తరిగి ఉంచుకోవాలి. పనీర్‌ని తురుముకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో అన్ని పదార్థాలూ వేసి తగినంత నీరు కలుపుతూ ముద్దలా చేసి ఒక తడిబట్ట కప్పి అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత 10 సమాన భాగాల ఉండలు చేసుకుని పరాటాలు చేసుకొని పెనంపై రెండువైపులా దోరగా కాల్చుకుని మీకిష్టమైన కూరతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇది మంచి విటమిన్‌ ఫుడ్‌. 

అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలివైకుంఠధామాల నిర్మాణానికి అడ్డంకులుఈసారైనా పూర్తయ్యేనా..?‘రైతు సమస్యలు తెలుసుకుంటే ఉలికిపాటు దేనికి?’రేవంత్‌ అంటే ఎందుకు భయం?చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపనఅభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement