Abn logo

మచ్చీ కబాబ్‌

కావలసిన పదార్థాలు : చేప (ముళ్లు తక్కువగా ఉన్నదేదైనా) - అరకేజి, బంగాళాదుంపలు - 2, ఉల్లికాడలు - 4, పచ్చిమిర్చి - 3, అల్లం - 2 అంగుళాల ముక్క, గుడ్లు - 2, బ్రెడ్‌ పొడి, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : ముందుగా చేపను ఆవిరిపై 10 నిమిషాల పాటు ఉడికించి ముళ్లన్నీ వేరుచేసి చల్లారనివ్వాలి. ఒక వెడల్పాటి పాత్రలో చేప ముక్కలతో పాటు తొక్కతీసిన బంగాళాదుంపలు, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, గిలకొట్టిన ఒక గుడ్డు, ఉప్పు, మిరియాపొడి, వేసి బాగా కలిపి సమాన భాగాలుగా చేసుకోవాలి. వీటిని కబాబ్‌ల్లా వత్తుకొని గిలకొట్టిన మరోగుడ్డులో ముంచి, బ్రెడ్‌ పొడిలో దొర్లించి పెనంపై రెండువైపులా దోరగా వేగించుకోవాలి. ఈ కబాబ్‌ల్ని వేడివేడిగా మీకిష్టమైన ఏ సాస్‌తో తిన్నా చాలా రుచిగా ఉంటాయి.

మంచిర్యాల కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులునిర్మల్‌లో రెండు సింహాల సంచారం?బాధిత కుటుంబాలకు పరామర్శ ‘ఎస్సీ, ఎస్టీ చట్టాల అమలులో నిర్లక్ష్యం’ బీడీ కార్మికులకు పని దినాలు పెంచండి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్‌ చైర్మన్‌నర్సరీని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌కడెం అడవుల్లో పర్యటించిన జడ్పీ చైర్మన్‌‘రైతులు కస్టమర్‌ చార్జీలను చెల్లించాలి’
Advertisement
Advertisement