Abn logo

రొయ్య కబాబ్‌

కావ

లసిన పదార్థాలు: పెద్ద రొయ్యలు - అరకేజి. మొదటిసారి కలపడానికి: ఉల్లిపాయ గుజ్జు -150 గ్రా., పసుపు - 1 టీ స్పూను, చింతపండు గుజ్జు- 50 గ్రా., ఉప్పు- కొంచెం. రెండోసారి కలపడానికి: ధనియాల పొడి - 100 గ్రా., జీలకర్ర పొడి - 75 గ్రా., మిరియాల పొడి - 50 గ్రా., కారం - 50 గ్రా., కొబ్బరి తురుము - 50 గ్రా., నెయ్యి - 1 టేబుల్‌ స్పూను.
మూడోసారి కలపడానికి: ఉల్లిపాయ గుజ్జు - 100 గ్రా., చింతపండు గుజ్జు - 100 గ్రా., కారం - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: రొయ్యల్ని శుభ్రం చేశాక మొదటిసారి పదార్థాలన్నీ కలిపి అందులోనే రొయ్యల్ని వేసి 2 గంటలపాటు ఉంచాలి. తర్వాత రొయ్యల్ని కడిగి పెట్టుకోవాలి. రెండోసారి కలిపే పదార్థాలను నేతిలో వేగించి అందులోనే మూడోసారి కలిపే పదార్థాలను కూడా వేసి చిక్కని పేస్టులా తయారుచేసుకోవాలి. రొయ్యల్ని ఈ పేస్టులో 3 గంటలపాటు నానబెట్టి తీసి సన్నని ఊసలకు గుచ్చి బొగ్గులపై దోరగా కాల్చుకోవాలి. బొగ్గులు దొరకని పక్షంలో గ్యాస్‌ స్టౌవ్‌పైన కూడా కాల్చుకోవచ్చు. వీటిని అన్నంతో పాటు నంజుకుంటే చాలా రుచిగా ఉంటాయి.

పూల సంబురంకేంద్ర పథకాల పరిశీలన అధికారులకు సహకరించాలికాంగ్రెస్‌లో కలవరంబాసరలో రైల్‌రోకోకు యత్నంప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలినేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ గుప్పిట్లోకి హైవే..!ఎక్సైజ్‌శాఖకు కిక్కునివ్వని దసరా..రక్తదాన శిబిరానికి విశేష స్పందన: ఎస్పీ సుదీంద్రవందశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలిపౌష్ఠికాహార లోపం ఉన్న వారిని గుర్తించాలి
Advertisement