బొంబాయి రవ్వ రసగుల్లా

ABN , First Publish Date - 2015-08-30T23:14:04+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలు - ఒక లీటరు, పుల్ల పెరుగు - అర లీటరు, పంచదార - పావు కిలో, బొంబాయి రవ్వ - ఒక స్పూను, యాలకులు - 2

బొంబాయి రవ్వ రసగుల్లా

కావలసిన పదార్థాలు: పాలు - ఒక లీటరు, పుల్ల పెరుగు - అర లీటరు, పంచదార - పావు కిలో, బొంబాయి రవ్వ - ఒక స్పూను, యాలకులు - 2
తయారుచేసే విధానం
పాలు బాగా కాగనిచ్చి అందులో పుల్ల పెరుగు వేయాలి. విరిగిన పాలు చల్లారాక పలుచని గుడ్డలో వేసి నీరంతా పిండేయాలి. విరిగిన పాలముద్దలో రవ్వ కలిపి బాగా పిండిలా మర్దించాలి. ఈ ముద్దను మీకు నచ్చిన ఆకారంలో గుండ్రంగా కానీ, కోలగా కానీ చేసుకుని ఉంచు కోవాలి. తర్వాత పంచ దార పాకంలో రసగుల్లా లను మునిగేలా వేసి సన్నని సెగమీద ఉడకనివ్వాలి. ఉడికి, పొంగిన రసగుల్లాలను దించి చల్లారనిచ్చి గాలి చొరవని డబ్బాల్లో నిలవ ఉంచుకోవచ్చు. రసగుల్లాలు పాకంతో పాటు తింటే బాగుంటాయి.

Updated Date - 2015-08-30T23:14:04+05:30 IST