బాదం తులసి షోర్బా

ABN , First Publish Date - 2015-08-26T22:01:07+05:30 IST

కావలసిన పదార్థాలు: బాదం పప్పులు - 50 గ్రా., తులిసి ఆకులు - 10, యాలకులు - 3, దాల్చినచెక్క - చిన్న ముక్క

బాదం తులసి షోర్బా

కావలసిన పదార్థాలు: బాదం పప్పులు - 50 గ్రా., తులిసి ఆకులు - 10, యాలకులు - 3, దాల్చినచెక్క - చిన్న ముక్క, లవంగాలు - 3, నీరు - 200 మి.లీ., ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: బాదం పప్పల్ని నానబెట్టి, మెత్తగా రుబ్బుకొని ఉంచుకోవాలి. దానిలో నీరు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి కలిపి పది నిమిషాలు మరిగించి వడకట్టుకోవాలి. వడకట్టిన నీటిలో ఉప్పు, మిరియాలపొడి కలిపి మరో ఐదు నిమిషాలు మరిగించాలి. ఇష్టం ఉన్నవాళ్లు 25 గ్రా. క్రీమ్‌ని చేర్చుకోవచ్చు. మరీ చిక్కగా అనిపిస్తే కాస్త వేడినీరు కలిపి పలచగా చేసుకోవచ్చు. వేగించిన బాదం పప్పు ముక్కల్ని పైన అలంకరించుకుని సూప్‌లా తాగండి.

Updated Date - 2015-08-26T22:01:07+05:30 IST