స్పానిష్‌ పొటాటో ఆమ్లెట్‌

ABN , First Publish Date - 2020-01-27T21:30:37+05:30 IST

గుడ్లు - 8, బంగాళదుంపలు - 300 గ్రా., ఉల్లిపాయలు - 100 గ్రా., ఆలివ్‌ ఆయిల్‌ - అరకప్పు + 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి - రుచికి సరిపడా.

స్పానిష్‌ పొటాటో ఆమ్లెట్‌

కావలసిన పదార్థాలు: గుడ్లు - 8, బంగాళదుంపలు - 300 గ్రా.,
ఉల్లిపాయలు - 100 గ్రా., ఆలివ్‌ ఆయిల్‌ - అరకప్పు + 3 టేబుల్‌ స్పూన్లు,
ఉప్పు, మిరియాల పొడి - రుచికి సరిపడా.
 
తయారుచేసే విధానం: బంగాళదుంపల తొక్క తీసి, శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరగాలి. నాన్‌స్టిక్‌ పాత్రలో అరకప్పు ఆలివ్‌ ఆయిల్‌ వేసి అందులో బంగాళదుంపల ముక్కలు వేసి 5 నిమిషాలు మగ్గించాలి. తర్వాత ఉల్లితరుగు కలిపి 15 నిమిషాలు వేగించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు గుడ్లలోని తెల్లసొన, పచ్చసొనలు వేరుచేసి విడివిడిగా నురుగు వచ్చేలా గిలకొట్టాలి. ఈ రెండు సొనలతో పాటు ఉప్పు, మిరియాల పొడిని బంగాళదుంపల మిశ్రమంలో కలిపి 10 నిమిషాలు పక్కనుంచాలి. పాన్‌లో 3 టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ వేసి గుడ్డు మిశ్రమం పోసి మూతపెట్టి సన్నటి మంటపై రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి.

Updated Date - 2020-01-27T21:30:37+05:30 IST