చికెన్‌ వింగ్స్‌

ABN , First Publish Date - 2019-12-28T17:57:56+05:30 IST

చికెన్‌ వింగ్స్‌ - అరకిలో, ఉల్లిపాయలు - రెండు, టొమాటోలు - మూడు, క్యాప్సికం - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్‌, పసుపు - ఒక టీస్పూన్‌,

చికెన్‌ వింగ్స్‌

కావలసిన పదార్థాలు: చికెన్‌ వింగ్స్‌ - అరకిలో, ఉల్లిపాయలు - రెండు, టొమాటోలు - మూడు, క్యాప్సికం - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్‌, పసుపు - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, ధనియాలపొడి - ఒకటిన్నర టీస్పూన్‌, జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్‌, ఎండుమిర్చి - మూడు, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, నిమ్మరసం - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
 
తయారీ విధానం: పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్‌ వింగ్స్‌ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, తగినంత ఉప్పు వేసి నెమ్మదిగా కలియబెట్టాలి. వింగ్స్‌ ఫ్రై అవుతున్న సమయంలో కావాలంటే మరి కొద్దిగా నూనె పోయవచ్చు. మసాలా తయారీ కోసం మరొక పాన్‌లో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి వేగించాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ వింగ్స్‌ వేసి కలపాలి. ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేగించాలి. టొమాటో ముక్కలు వేయాలి. క్యాప్సికం ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి.
చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-12-28T17:57:56+05:30 IST