హిల్సా ఫిష్‌ కర్రీ

ABN , First Publish Date - 2019-11-30T17:18:20+05:30 IST

హిల్సా చేప(కిల్లలు) - అరకిలో, జీలకర్ర - ఒక టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - నాలుగు, ఆవాలు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.

హిల్సా ఫిష్‌ కర్రీ

కావలసిన పదార్థాలు: హిల్సా చేప(కిల్లలు) - అరకిలో, జీలకర్ర - ఒక టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - నాలుగు, ఆవాలు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారీ విధానం: ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసి చేప ముక్కలను వేగించి పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్‌లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోయాలి. పసుపు, తగినంత ఉప్పు వేసి నీళ్లు మరగనివ్వాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేయాలి. పచ్చి మిర్చి వేయాలి. రెండు, మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే గ్రేవీ చిక్కగా అవుతుంది. అన్నంలోకి ఈ చేపల కూర రుచిగా ఉంటుంది.

Updated Date - 2019-11-30T17:18:20+05:30 IST