Abn logo

గుమ్మడికాయ వడియాలు

కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ - మూడు కేజీలు, మినప్పప్పు - 400గ్రాములు, పచ్చిమిర్చి - 50 గ్రాములు, పసుపు - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారీ విధానం: మినప్పప్పును శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కనీసం నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. మినప్పప్పులో నీళ్లు తీసేసి మిక్సీలో వేసి పట్టుకోవాలి. గుమ్మడికాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పైపొట్టు తీయాల్సిన అవసరం లేదు. గుమ్మడికాయ ముక్కలను ఒక పాత్రలోకి తీసుకుని ఉప్పు వేసి కలియబెట్టి అరగంటపాటు పక్కన పెట్టాలి. ఉప్పు కలపడంతో గుమ్మడి ముక్కల మీద నీళ్లు ఊరతాయి. ఆ నీళ్లు తీసేయాలి.
 
ముక్కలను చేతుల్లోకి తీసుకుంటూ నీళ్లు కొంచెం కూడా లేకుండా పిండేయాలి. ఒక తెల్లటి వస్త్రంలో గుమ్మడికాయ ముక్కలు వేసి ఆరనివ్వాలి. తరువాత వాటిలో మినప్పప్పు, పచ్చిమిర్చి పేస్టు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఎండలో కాటన్‌ వస్త్రం పరిచి గుమ్మడి ముక్కల్ని చేతుల్లోకి తీసుకుంటూ వడియాలు వేయాలి. వడియాలను కనీసం నాలుగు రోజులపాటు ఎండనివ్వాలి. దాంతో వడియాలు ఎండిన తరువాత చిన్నగా అవుతాయి. వీటిని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నూనెలో ఫ్రై చేసుకొని తినొచ్చు.


బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల బారులు

దీపాలు వెలిగించాలంటూ డప్పు చాటింపు

ఘన్‌పూర్‌లో బియ్యం పంపిణీ ప్రారంభం

కూలీలకు సరుకుల పంపిణీ

పకడ్బందీగా లాక్‌డౌన్‌

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

కరోనా కలకలం

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

వలస కూలీలకు ఆశ్రయం

శానిటైజర్ల అందజేత
Advertisement
d_article_rhs_ad_1

నవ్య