Abn logo

ఉసిరికాయ సబ్జీ

కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు - ఒక కప్పు(గింజలు తీసి, చిన్నగా కట్‌ చేసినవి), ఆవాలు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, ఆవాల నూనె - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, సోంపు - అర టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, బెల్లం - ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట.
 
తయారీ విధానం: ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి చిన్నమంటపై వేగించాలి. కాసేపయ్యాక ఉసిరికాయ ముక్కలు వేసి కలపాలి. మధ్యమధ్యలో కలియబెడుతూ ఉండాలి. కారం, పసుపు, సోంపు, ధనియాల పొడి, ఇంగువ, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగనివ్వాలి. తరువాత అరకప్పు నీళ్లు, బెల్లం వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి. అన్నంలోకి లేదా చపాతీలోకి ఈ సబ్జీ రుచిగా ఉంటుంది.

కొనసాగుతున్న వలసలుయువజన కాంగ్రెస్‌ కమిటీ రద్దుఅటవీ జంతువులకు హాని కలిగిస్తే కఠినచర్యలుమండల సర్పంచ్‌ల సంఘం కార్యవర్గం పెరుగుతున్న హోంక్వారంటైన్లులెక్క తేలేదెన్నడో?నకిలీ విపత్తు నిషేధిత తంబాకు పట్టివేత‘నియంత్రిత సాగు అమలయ్యేలా చూడాలి’చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
Advertisement
d_article_rhs_ad_1
Advertisement