ఉసిరి అన్నం

ABN , First Publish Date - 2019-11-11T18:10:40+05:30 IST

బియ్యం - ఒక కప్పు, జీడిపప్పు - పది పలుకులు, సెనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉసిరికాయలు - పదిహేను, పసుపు - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి

ఉసిరి అన్నం

కావలసిన పదార్థాలు: బియ్యం - ఒక కప్పు, జీడిపప్పు - పది పలుకులు, సెనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉసిరికాయలు - పదిహేను, పసుపు - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - పది, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, ఆవాలు - అర టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారీ విధానం: ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయల్లో గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు పలుకులు వేసి వేగించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. కాసేపయ్యాక ఉసిరికాయ ముక్కలు వేయాలి. పసుపు, ఉప్పు వేసి కలియబెట్టి మరికాసేపు వేగించాలి. మూత పెట్టి చిన్న మంటపై కాసేపు వేగించి దింపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో సమంగా, రుచికి తగిన విధంగా కలపాలి.

Updated Date - 2019-11-11T18:10:40+05:30 IST