కార్న్‌ దోశ

ABN , First Publish Date - 2019-07-20T21:04:58+05:30 IST

మొక్కజొన్నలు(కార్న్‌) - రెండు కప్పులు, మినప్పప్పు - అరకప్పు, ఎండుమిర్చి - నాలుగు

కార్న్‌ దోశ

కావలసినవి
 
మొక్కజొన్నలు(కార్న్‌) - రెండు కప్పులు, మినప్పప్పు - అరకప్పు, ఎండుమిర్చి - నాలుగు, జీలకర్ర - అరటీస్పూన్‌, కరివేపాకు - ఒకకట్ట, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు, నూనె - తగినంత.
 
తయారీవిధానం
 
మొక్కజొన్నలను రెండు, మూడు గంటలు నానబెట్టాలి. మినప్పప్పును గంట ముందుగా నానబెట్టాలి. తరువాత నీటిని తీసేసి మొక్కజొన్నలను మెత్తగా పట్టుకోవాలి.
అవసరమైతే కొన్ని నీళ్లు వేసుకోవచ్చు. అందులో జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. అలాగే ఉల్లిపాయలు, మినప్పప్పును గ్రైండ్‌ చేయాలి. ఈ రెండింటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉదయాన బ్రేక్‌ఫా్‌స్టలో కార్న్‌ దోశ కావాలనుకునే వారు రాత్రే గ్రైండ్‌ చేసి, కలుపుకొని పెట్టుకోవాలి. ఉదయానికల్లా పిండి బాగా పులిసి దోశలు బాగా వస్తాయి. మందంగా ఉన్న పాన్‌పై దోశలు పోసుకొని, నూనె వేసి కాల్చుకోవాలి. సాంబార్‌ లేదా చట్నీతో తింటే కార్న్‌ దోశ రుచిగా ఉంటుంది.

Updated Date - 2019-07-20T21:04:58+05:30 IST