కార్న్‌ పలావ్‌

ABN , First Publish Date - 2019-07-20T21:02:52+05:30 IST

బాస్మతి బియ్యం - పావుకేజీ, కార్న్‌ - అరకప్పు, ఆలివ్‌ ఆయిల్‌ - రెండుటీస్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి

కార్న్‌ పలావ్‌

కావలసినవి
 
బాస్మతి బియ్యం - పావుకేజీ, కార్న్‌ - అరకప్పు, ఆలివ్‌ ఆయిల్‌ - రెండుటీస్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, అల్లం వెల్లుల్లిపేస్టు - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి - నాలుగు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, బిర్యానీ ఆకు - ఒకటి, మిరియాలు - అరటీస్పూన్‌;
లవంగాలు - ఎనిమిది, వేడి నీళ్లు - రెండు కప్పులు, కొత్తిమీర - ఒకకట్ట,
నిమ్మరసం - రెండు టీస్పూన్లు, కొబ్బరి - కొద్దిగా.
 
తయారీవిధానం
ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి పావుగంట పాటు నానబెట్టాలి. గ్రైండర్‌లో కొబ్బరిని చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి పేస్టు మాదిరిగా చేసుకోవాలి. ఒక పాన్‌ తీసుకుని ఆలివ్‌ ఆయిల్‌ వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు వేసి వేగించాలి. తరువాత కార్న్‌ వేసి మరికాసేపు వేగించాలి. బియ్యం నీళ్లను కార్న్‌ మిశ్రమంలో వేయాలి. వేడి నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి పావుగంట పాటు ఉడికించాలి. అన్నం దాదాపు ఉడికిన తరువాత నిమ్మరసం పిండాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకొని దింపుకోవాలి.

Updated Date - 2019-07-20T21:02:52+05:30 IST