బిసిబేళ బాత్‌

ABN , First Publish Date - 2019-08-17T17:12:24+05:30 IST

కందిపప్పు - అరకప్పు, క్యారెట్‌ - ఒకటి, బీన్స్‌ - ఐదు, బఠానీలు - పావు కప్పు, ఉల్లిపాయలు - రెండు, టొమాటో - ఒకటి, బంగాళదుంప - ఒకటి, నెయ్యి - ఒక

బిసిబేళ బాత్‌

కావలసినవి
 
కందిపప్పు - అరకప్పు, క్యారెట్‌ - ఒకటి, బీన్స్‌ - ఐదు, బఠానీలు - పావు కప్పు, ఉల్లిపాయలు - రెండు, టొమాటో - ఒకటి, బంగాళదుంప - ఒకటి, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, చింతపండు - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - రుచికి తగినంత, ఎండు మిర్చి - నాలుగు, మిరియాలు - కొద్దిగా, మెంతులు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నువ్వులు - ఒకటేబుల్‌స్పూన్‌, నూనె - ఒక టీస్పూన్‌, కరివేపాకు - ఒక కట్ట, ఆవాలు - ఒక టీస్పూన్‌, బియ్యం - ఒకకప్పు.
 
తయారీవిధానం
 
బియ్యం, కందిపప్పును శుభ్రంగా కడిగి పావుగంటపాటు నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్‌లో వేసి ఉడికించాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమన్న తరువాత జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయలు వేయాలి. బంగాళదుంప, క్యారెట్‌ ముక్కలు, బీన్స్‌, బఠానీ, టొమాటో ముక్కలు వేసి కలియబెట్టాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు వేయాలి. తగినంత ఉప్పు వేసి కాసేపు ఉడికించాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, అన్నం మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి. చిన్నమంటపై కాసేపు ఉంచుకుని, నెయ్యి వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొంటే బిసిబేళ బాత్‌ రెడీ.

Updated Date - 2019-08-17T17:12:24+05:30 IST