రాగి ముద్ద

ABN , First Publish Date - 2019-06-22T18:09:07+05:30 IST

ఒక పాత్రలో రాగిపిండి తీసుకొని నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరొకపాత్రలో

రాగి ముద్ద

కావలసినవి
 
రాగి పిండి - అరకప్పు, నీళ్లు - ఒకకప్పు, ఉప్పు - తగినంత.
 
తయారీవిధానం
 
ఒక పాత్రలో రాగిపిండి తీసుకొని నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
మరొకపాత్రలో నీళ్లు పోసి, పిండి వేసి చిన్నమంటపై ఉడికించుకోవాలి. రాగి పిండి నీళ్లను త్వరగా గ్రహిస్తుంది. కాసేపు ఉడికిన తరువాత మిశ్రమం చిక్కగా ఉన్నప్పుడే స్టవ్‌ పైనుంచి దింపుకోవాలి. కొద్దిగా చల్లారాక ముద్దలుగా చేసుకుని సాంబర్‌తో లేక ఇష్టమైన గ్రేవీతో వడ్డించుకోవాలి.

Updated Date - 2019-06-22T18:09:07+05:30 IST