గోబీ మంచూరియా

ABN , First Publish Date - 2019-06-29T20:10:34+05:30 IST

క్యాలీఫ్లవర్‌ - ఒకటి(మీడియం సైజు), మైదా - పావుకప్పు, మొక్కజొన్నపిండి - ఒక టేబుల్‌స్పూన్‌

గోబీ మంచూరియా

కావలసినవి
 
క్యాలీఫ్లవర్‌ - ఒకటి(మీడియం సైజు), మైదా - పావుకప్పు, మొక్కజొన్నపిండి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, కారం - పావు టీస్పూన్‌, అల్లంవెల్లుల్లిపేస్టు - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, అజినోమోటో - చిటికెడు, సోయాసాస్‌ - రెండు టేబుల్‌స్పూన్‌లు, టొమాటో కెచప్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, క్యాప్సికం - ఒకటి, నూనె - తగినంత.
 
తయారీవిధానం
 
క్యాలీఫ్లవర్‌ను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక పాత్రలో మైదా, మొక్కజొన్న పిండి, అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. మిశ్రమం బాగా చిక్కగా కాకుండా, బాగా పలుచగా కాకుండా చూసుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక క్యాలీఫ్లవర్‌ ముక్కలను వేసి గోధుమరంగు వచ్చే వరకు వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండుమిర్చి, పచ్చి మిర్చి వేసి వేగించాలి. క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కలపాలి. అజినోమోటో, సోయాసాస్‌, టొమాటో సాస్‌ వేసి బాగా కలపాలి. తరువాత వేగించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్‌ ముక్కలను వేయాలి. మొక్కజొన్న పిండి చల్లుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-06-29T20:10:34+05:30 IST