లాకీ కోఫ్తా

ABN , First Publish Date - 2019-07-06T14:23:27+05:30 IST

సొరకాయను గుజ్జుగా చేసి అందులోని నీటిని ఒక కప్పులో పిండి పక్కన పెట్టుకోవాలి. నీరు తీసేసిన సొరకాయ గుజ్జులో ఉప్పు, కారం, సెనగపిండి వేసి కలపాలి.

లాకీ కోఫ్తా

కావలసినవి
 
కోఫ్తా కోసం: సొరకాయ ముక్కలు - రెండు కప్పులు, ఉప్పు - తగినంత, కారం - ఒక టీస్పూన్‌, సెనగపిండి - అరకప్పు, చింతపండు - కొద్దిగా.
గ్రేవీ కోసం: ఉల్లిపాయలు - రెండు, ఉప్పు - తగినంత, కారం - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - రెండుటీస్పూన్‌లు, టొమాటో ప్యూరీ - రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర - ఒకకట్ట, నీళ్లు - రెండు కప్పులు.
గ్రేవీ తయారీ
ఒక పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు వేయాలి. ఉప్పు, పసుపు వేసి కాసేపు వేగించాలి. కారం, ధనియాల పొడి వేయాలి. సొరకాయ గుజ్జు పిండగా వచ్చిన నీళ్లు పోయాలి. కాసేపు ఉడికించాలి. ఇప్పుడు టొమాటో ప్యూరీ, కొత్తిమీర వేసి ఐదునిమిషాల పాటు ఫ్రై చేయాలి. కొన్ని నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. తరువాత డీప్‌ ఫ్రై చేసిన కోఫ్తాలు వేయాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకొని, లాకీ కోఫ్తా కర్రీని వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.
 
 
తయారీవిధానం
 
సొరకాయను గుజ్జుగా చేసి అందులోని నీటిని ఒక కప్పులో పిండి పక్కన పెట్టుకోవాలి.
నీరు తీసేసిన సొరకాయ గుజ్జులో ఉప్పు, కారం, సెనగపిండి వేసి కలపాలి.
చేతులకు నూనె రాసుకుని కాస్త చింతపండు పెడుతూ ఉండలుగా చేసుకోవాలి.
వీటిని గోధుమ రంగు వచ్చే వరకు నూనెలో వేగించాలి.

Updated Date - 2019-07-06T14:23:27+05:30 IST