పానకం

ABN , First Publish Date - 2019-04-13T14:29:48+05:30 IST

బెల్లం - అరకప్పు, నీళ్లు - రెండు కప్పులు, శొంఠిపొడి - పావు టీస్పూన్‌, నల్లమిరియాల పొడి - చిటికెడు..

పానకం

కావలసిన పదార్థాలు
బెల్లం - అరకప్పు, నీళ్లు - రెండు కప్పులు, శొంఠిపొడి - పావు టీస్పూన్‌, నల్లమిరియాల పొడి - చిటికెడు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - చిటికెడు, తులసి ఆకులు - కొన్ని, ఐస్‌ముక్కలు - నాలుగు.
 
తయారుచేయు విధానం
ఒక పాత్రలో బెల్లం తీసుకొని, రెండు కప్పుల నీళ్లు పోయాలి. బెల్లం మొత్తం నీటిలో కరిగేవరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం అందులో కలుపుకోవాలి. తరువాత శొంఠిపొడి, యాలకులపొడి, మిరియాలపొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. పానకం చల్లగా ఉండాలనుకుంటే ఐస్‌ముక్కలు వేసుకోవచ్చు. తులసి ఆకులు వేసి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-04-13T14:29:48+05:30 IST