పైనాపిల్‌ స్ట్రాబెర్రీ స్మూతీ

ABN , First Publish Date - 2019-04-22T15:07:38+05:30 IST

పైనాపిల్‌ స్మూతీ కోసం.. పైనాపిల్‌ ముక్కలు- రెండు కప్పులు, ఓట్స్‌- రెండు టేబుల్‌ సూన్లు, బాదం- రెండు టేబుల్‌ స్పూన్లు..

పైనాపిల్‌ స్ట్రాబెర్రీ స్మూతీ

కావలసినవి: పైనాపిల్‌ స్మూతీ కోసం.. పైనాపిల్‌ ముక్కలు- రెండు కప్పులు, ఓట్స్‌- రెండు టేబుల్‌ సూన్లు, బాదం- రెండు టేబుల్‌ స్పూన్లు, కోకొనట్‌ యోగర్ట్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, నీళ్లు లేదా పాలు-కప్పు.
 
స్ట్రాబెర్రీ స్మూతీ కోసం.. స్ట్రాబెర్రీ ముక్కలు -రెండు కప్పులు, సబ్జాగింజలు- టేబుల్‌ స్పూను, కోకోనట్‌ యోగర్ట్‌- రెండు టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ: పైనాపిల్‌ ముక్కలు, ఓట్స్‌, బాదం, కోకొనట్‌ యోగర్ట్‌ను మిక్సీలో వేసి చిక్కని ద్రావణంలా చేసుకోవాలి. అలాగే స్ట్రాబెర్రీ ముక్కలు, సబ్జాగింజలు, కోకొనట్‌ యోగర్ట్‌లను మిక్సీ పడితే స్ట్రాబెర్రీ స్మూతీ తయారవుతుంది. ముందుగా స్ట్రాబెర్రీ స్మూతీని గ్లాసులో పోయాలి. తర్వాత పైనాపిల్‌ స్మూతీని పోసి, పైనాపిల్‌ లేదా స్ట్రాబెర్రీ ముక్కలతో అలంకరించి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2019-04-22T15:07:38+05:30 IST