మామిడికాయ పులిహోర
v id="pastingspan1">
కావలసిన పదార్థాలు
పచ్చి మామిడికాయ - ఒకటి, అన్నం - కప్పు, ఆవాలు - టీస్పూన్, మినప్పప్పు - అరటీస్పూన్, సెనగపప్పు - అరటీస్పూన్, వేరుసెనగలు - టీస్పూన్, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - ఒకకట్ట, పసుపు - అర టీస్పూన్, నువ్వుల నూనె - 3 టీస్పూన్లు, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం
ఒకపాత్రలో నూనె తీసుకొని కాస్త వేడి అయ్యాక ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటమన్న తరువాత మినప్పప్పు, సెనగపప్పు, పచ్చిమిర్చి వేయాలి. కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి బాగా కలపాలి. తురిమిపెట్టుకున్న మామిడికాయ కూడా వేసి, చక్కగా కలియబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని సిద్ధంగా పెట్టుకున్న అన్నంలో వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని సర్వ్ చేసుకోవాలి.