కీర, టొమోటో సలాడ్‌

ABN , First Publish Date - 2019-03-23T20:55:38+05:30 IST

ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి), ధనియాలు- 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు- 2 టేబుల్‌ స్పూన్లు

కీర, టొమోటో సలాడ్‌

కావలసిన పదార్థాలు
 
ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి), ధనియాలు- 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు- 2 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర - 1 టేబుల్‌ స్పూన్‌, సిడార్‌ వెనిగర్‌- 1 కప్పు, చక్కెర - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు- కొద్దిగా, పెద్ద టొమాటోలు- మూడు (ముక్కలుగా), కీర- 1 (తరగాలి), ఆలివ్‌ ఆయిల్‌- కొద్దిగా, కొత్తిమీర- అర కప్పు
 
తయారీవిధానం
 
పొయ్యి మీద పెనం పెట్టి వేడయ్యాక ఆవాలు, ధనియాలు చిటపట వేగించాలి.
వాటికి జీలకర్ర కూడా కలపాలి. పది సెకన్లలో మంచి వాసన వస్తుంది. అప్పుడు వెనిగర్‌, చక్కెర, టేబుల్‌ స్పూను ఉప్పు వేసి, ఒక కప్పు నీళ్లు పోయాలి. ఆ మిశ్రమంలో చక్కెర, ఉప్పు కలిసిపోయిన తర్వాత ఆపాలి. ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు వేసి దానిపై ఈ వెనిగర్‌ మిశ్రమాన్ని పోయాలి. చల్లారిన తర్వాత గిన్నెపై మూతపెట్టి ఫ్రిజ్‌లో గంటపాటు చల్లబరచాలి. టొమోటోలు, కీరను ప్లేట్‌లో అందంగా అమర్చి, వాటిపై నుంచి ఈ మిశ్రమాన్ని పోయాలి. తర్వాత కొత్తిమీర చల్లి సర్వ్‌ చేస్తే రుచికరంగా బాగుంటుంది.

Updated Date - 2019-03-23T20:55:38+05:30 IST