పెసర మొలకల సలాడ్‌

ABN , First Publish Date - 2019-02-16T20:41:49+05:30 IST

పెసల్లో మాంసకృత్తులు, పీచు ఎక్కువ. మొలకెత్తినవైతే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ..

పెసర మొలకల సలాడ్‌

పెసల్లో మాంసకృత్తులు, పీచు ఎక్కువ. మొలకెత్తినవైతే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ పరిమాణంలో పొందవచ్చు. ఇవి మెదడును చురుకుగా ఉంచుతాయి. పెసలతో సలాడ్‌ ఎలా తయారు చేయాలంటే...
 
కావలసిన పదార్థాలు: పెసర మొలకలు - అర కప్పు, కార్న్‌ఫ్లేక్స్‌ - అర కప్పు, ఉల్లి ముక్కలు - 1 టేబుల్‌స్పూను, టొమాటో ముక్కలు -1 టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి - ఒకటి, పుదీనా, కొత్తిమీర తరుగు-టేబుల్‌ స్పూను, ఉప్పు, నిమ్మరసం - తగినంత
 
తయారీ విధానం:
పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి గిన్నెలో సర్వ్‌ చేయాలి.

Updated Date - 2019-02-16T20:41:49+05:30 IST