బృందావన్‌ లస్సీ

ABN , First Publish Date - 2018-09-01T19:24:15+05:30 IST

పెరుగు - రెండు కప్పులు, చక్కెర - నాలుగు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి - చిటికెడు, నీళ్లు...

బృందావన్‌ లస్సీ

కావలసినవి
 
పెరుగు - రెండు కప్పులు, చక్కెర - నాలుగు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి - చిటికెడు, నీళ్లు - సరిపడినన్ని, రోజ్‌వాటర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, రోజ్‌ సిరప్‌ - పావు టీ స్పూను, పేడా - రెండు. అలంకరణకు: పిస్తాపప్పులు - ఒక టీస్పూను, కేసరి - ఒక చిటికెడు (కుంకుమపువ్వు), ఎండిన గులాబీ రెక్కలు - పావు టేబుల్‌స్పూను, మట్టిగ్లాసులు - రెండు.
 
తయారీవిధానం
 
లోతు ఎక్కువగా ఉండే పాన్‌లో పెరుగు పోయాలి. అందులో చక్కెర వేసి హ్యాండ్‌ బ్లెండర్‌తో బాగా గిలక్కొట్టాలి. గడ్డ పెరుగైతే కాస్త నీళ్లు పోయొచ్చు. లస్సీ చిక్కగా ఉండాలనుకుంటే నీళ్లు కలపనవసరం లేదు. పెరుగును బాగా గిలక్కొట్టడం వల్ల చక్కెర అందులో బాగా కలుస్తుంది. ఈ చిక్కటి లస్సీని రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి. రెడీగా పెట్టుకున్న మట్టి గ్లాసులను చల్లటి నీళ్లల్లో వేసి ఉంచాలి. లస్సీ రెడీ చేయాలనుకున్నప్పుడు నీళ్లల్లోని మట్టి గ్లాసులను తీసి వాటిల్లో రోజ్‌వాటర్‌, రోజ్‌ సిరప్‌ సమపాళ్లల్లో ఆ గ్లాసుల్లో పోయాలి. ఒక్కొక్క గ్లాసులో ఒక పేడాను చిదిమి వేయాలి. తర్వాత ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని లస్సీని ఈ గ్లాసుల్లో పోయాలి. ఆ లస్సీ మీద చిటికెడు కుంకుమపువ్వు , పిస్తాపలుకులు, యాలకులపొడి, వాడిపోయిన గులాబీరెక్కలు చల్లాలి. బృందావన్‌ లస్సీ సిద్ధం.

Updated Date - 2018-09-01T19:24:15+05:30 IST