ఫిష్‌ ఎగ్‌ పకోడి

ABN , First Publish Date - 2018-07-09T18:10:28+05:30 IST

చేప గుడ్లు - పావు కేజీ, శనగపిండి - ఒక కప్పు, బియ్యప్పిండి - ముప్పావు కప్పు, ఉల్లిపాయ (పెద్దది) - 1, వెల్లిల్లి (8) పచ్చిమిర్చి (2) పేస్టు - ఒక టేబుల్‌ స్పూను, కొత్తిమీర తరుగు,

ఫిష్‌ ఎగ్‌ పకోడి

కావలసిన పదార్థాలు: చేప గుడ్లు - పావు కేజీ, శనగపిండి - ఒక కప్పు, బియ్యప్పిండి - ముప్పావు కప్పు, ఉల్లిపాయ (పెద్దది) - 1, వెల్లిల్లి (8) పచ్చిమిర్చి (2) పేస్టు - ఒక టేబుల్‌ స్పూను, కొత్తిమీర తరుగు, పసుపు, కారం, గరం మసాల, ఉప్పు తగినంత. నూనె వేగించడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం: ఒక లోతైన, వెడల్పాటి పాత్రలో చేప గుడ్లతో పాటు (నూనె తప్పించి) తక్కిన పదార్థాలన్నీ వేసి, నీళ్లు పోయకుండా చిక్కగా కలుపుకోవాలి. తర్వాత నూనె వేడి చేసి స్పూనుతో కొంత కొంత మిశ్రమాన్ని పకోడీలుగా వేసి రెండు వైపులా దోరగా వేగించాలి. ఇవి సాంబారన్నంతో సైడ్‌ డిష్‌గా, లేదా ఈవినింగ్‌ స్నాక్స్‌గా ఎంతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2018-07-09T18:10:28+05:30 IST