పుదీనా లస్సీ

ABN , First Publish Date - 2018-05-30T23:59:22+05:30 IST

గడ్డ పెరుగు - ఒకటిన్నర కప్పు, తరిగిన పుదీనా ఆకులు - గుప్పెడు, అల్లం రసం - అర టీ స్పూను...

పుదీనా లస్సీ

కావలసిన పదార్థాలు
 
గడ్డ పెరుగు - ఒకటిన్నర కప్పు, తరిగిన పుదీనా ఆకులు - గుప్పెడు, అల్లం రసం - అర టీ స్పూను, నీళ్లు - ఒకటిన్నర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, బ్లాక్‌ సాల్ట్‌ - పావు టీ స్పూను, వేగించిన జీలకర్ర పొడి - పావు టీ స్పూను
 
తయారుచేసే విధానం
 
రెండు స్పూన్ల పెరుగు, పుదీనా ఆకులు, అల్లం రసం మిక్సీలో వేసి పేస్టు చెయ్యండి. ఈ పేస్టును గిలకొట్టిన పెరుగు+నీళ్లలో కలపండి. తర్వాత ఉప్పు, బ్లాక్‌ సాల్ట్‌ కూడా కలిపి, గ్లాసుల్లో ఐసు వేసి పైన లస్సీ పొయ్యండి. దీనిపై జీలకర్ర పొడి, రెండు పుదీనా ఆకులు అలంకరించి సర్వ్‌ చేయండి. మధ్యాహ్నం భోజనం తరువాత కానీ, సాయంత్రం ‘టీ’ బదులుగా కానీ తీసుకుంటే బాగుంటుంది. ఎండలో చల్లచల్లగా తాగితే అలసట కూడా తగ్గుతుంది.

Updated Date - 2018-05-30T23:59:22+05:30 IST