పెసర మొలకల సమ్మర్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2018-06-09T23:17:12+05:30 IST

మొలకెత్తిన పెసలు - 2 కప్పులు, ఉల్లి తరుగు - 1/2 కప్పు, టమాటా ముక్కలు - 1/2 కప్పు, వేగించిన వేరుశెనగపప్పు

పెసర మొలకల సమ్మర్‌ సలాడ్‌

కావలసిన పదార్థాలు
 
మొలకెత్తిన పెసలు - 2 కప్పులు, ఉల్లి తరుగు - 1/2 కప్పు, టమాటా ముక్కలు - 1/2 కప్పు, వేగించిన వేరుశెనగపప్పు (పల్లీలు) - 1/2 కప్పు, కీరా దోస ముక్కలు - 1/2 కప్పు, సన్నగా తరిగిన పుదీనా + కొత్తిమీర - 1/2 కప్పు, ఉప్పు, నిమ్మరసం, చాట్‌ మసాలా - తగినంత.
 
తయారుచేసే విధానం
మొలకెత్తిన పెసలను పచ్చిగా లేదా కొద్దిగా నీళ్లలో ఉడికించి కానీ సలాడ్‌లో వాడుకోవచ్చు. పెసలు, కూర ముక్కలు, వేరుశెనగ పప్పు ఒక గాజు గిన్నెలో కలపండి. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచి, వడ్డించే ముందు ఉప్పు, చాట్‌ మసాలా, నిమ్మరసం కలిపితే తాజాగా ఉంటుంది. వేసవి సాయంత్రాలు స్నాక్‌గా తీసుకుంటే చల్లగా బాగుంటుంది.

Updated Date - 2018-06-09T23:17:12+05:30 IST