స్వీట్‌ సన్‌షైన్‌

ABN , First Publish Date - 2018-04-27T19:40:23+05:30 IST

కమలాపండ్లు - ఐదు (పెద్దవి, తొక్క వలిచి), కీరదోసకాయ - ఒకటి, క్యారెట్లు - పది (పెద్దవి), పుదీనా ఆకులు

స్వీట్‌ సన్‌షైన్‌

కావలసినవి
 
కమలాపండ్లు - ఐదు (పెద్దవి, తొక్క వలిచి), కీరదోసకాయ - ఒకటి, క్యారెట్లు - పది (పెద్దవి), పుదీనా ఆకులు - పది, అల్లం - చిన్న ముక్క, క్రాన్‌బెర్రీస్‌ - అరకప్పు.
 
తయారీవిధానం
 
పైన చెప్పిన అన్నింటినీ జ్యూసర్‌లో వేసి రసం తీయాలి. తరువాత స్పూన్‌తో బాగా కలిపి వెంటనే తాగేయాలి. కమలా, క్యారెట్ల తీపి, క్రాన్‌బెర్రీస్‌ పులుపు, కీరదోసకాయ, పుదీనాల వల్ల తాజాదనాలు వస్తాయి. అల్లం వాడకం వల్ల ఈ జ్యూస్‌కు మసాలా రుచి కూడా వస్తుంది.
నోట్‌: క్రాన్‌బెర్రీస్‌కు బదులు నిమ్మరసం అయినా వాడొచ్చు.

Updated Date - 2018-04-27T19:40:23+05:30 IST