మ్యాంగో చికెన్‌

ABN , First Publish Date - 2018-02-24T23:31:04+05:30 IST

చికెన్‌ - 400 గ్రా, పచ్చి మామిడికాయ (చిన్నది) - 1, ఉల్లిపాయ - 1, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 స్పూను, ఉప్పు...

మ్యాంగో చికెన్‌

కావలసిన పదార్థాలు
 
చికెన్‌ - 400 గ్రా, పచ్చి మామిడికాయ (చిన్నది) - 1, ఉల్లిపాయ - 1, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 స్పూను, ఉప్పు, కారం - తగినంత, గరంమసాలా - 1/2 స్పూను, పసుపు - తగినంత, నూనె - 3 స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
ముందుగా చికెన్‌ ముక్కలకు ఉప్పు, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు పట్టించి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచండి. ఉల్లిపాయ తరుగు వేగించి పేస్టుచేసి పెట్టుకోండి. మామిడికాయను ముక్కలు చేసి కొంచం నీళ్లలో ఉడికించండి (ఈ నీళ్లను తరువాత కూరలో వాడవచ్చు). ప్రెషర్‌ కుక్కర్లో నూనె వేసి, కాగిన తర్వాత చికెన్‌ వేయండి. ఒక విజిల్‌ వచ్చేవరకు ఉడికించి ఆపెయ్యండి. ఉడికిన చికెన్‌కు ఉల్లిపేస్టు, మామిడిగుజ్జు కలిపి 5 నిముషాలు ఉడకనివ్వండి. అంతే - మామిడికాయ చికెన్‌ రెడీ! దీనిని పలావ్‌తో, చపాతీతో, రైస్‌తో .. ఎలా అయినా తినొచ్చు.

Updated Date - 2018-02-24T23:31:04+05:30 IST