బొమ్మిడాయిల పులుసు

ABN , First Publish Date - 2018-01-20T21:52:19+05:30 IST

బొమ్మిడాయిలు- 5, మెంతులు, ఆవాలు- ఒక్కో టీస్పూను, ఉల్లిపాయలు-2...

బొమ్మిడాయిల పులుసు

కావలసినవి
 
బొమ్మిడాయిలు- 5, మెంతులు, ఆవాలు- ఒక్కో టీస్పూను, ఉల్లిపాయలు-2 (సన్నగా తరిగి), పచ్చిమిర్చి-ఐదు (సగానికి చీరాలి), కరివేపాకు- గుప్పెడు, టొమాటోలు-4 (సన్నముక్కలుగా),పసుపు, కారం- ఒక్కొక్కటి ఒక్కో టేబుల్‌స్పూను, ధనియాలపొడి- ఒక టేబుల్‌స్పూను, ఉప్పు- రెండు టీస్పూన్లు లేదా తగినంత, చింతపండురసం-ఒక కప్పు.
 
తయారీవిధానం
 
కడాయిలో నూనె వేడిచేయాలి. అందులో మెంతులు, ఆవాలు వేసి వేగించాలి.
తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయముక్కల్ని వేసి బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేగించి అందులో కొన్ని కరివేపాకులు, తరిగిన పచ్చిమిరపకాయముక్కలు వేయాలి.
అవసరమైతే ఇంకొద్దిగా నూనె వాడొచ్చు. ఇందులో టొమాటో ముక్కలు కూడా వేసి వేగించాలి. తర్వాత కారం, పసుపు వేసి బాగా కలపాలి. వాటితోపాటు ధనియాలపొడి, ఉప్పు కూడా వేసి కలపాలి. రెడీగా పెట్టుకున్న చింతపండు రసం పోస్తే మిశ్రమం పలుచగా అవుతుంది. దాన్ని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. చివరిగా రెడీగా పెట్టుకున్న బొమ్మిడాయిల ముక్కల్ని అందులో వేసి ఎనిమిది నిమిషాలపాటు ఉడకనివ్వాలి. ఈ పులుసును వేడి అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-01-20T21:52:19+05:30 IST