ఫిష్‌ ఫింగర్స్‌

ABN , First Publish Date - 2017-07-08T17:22:47+05:30 IST

స్నేపర్‌ ఫిల్లెట్స్‌- 750 గ్రాములు (వైట్‌ ఫిష్‌వి), ఉడకబెట్టి, మెత్తగా చేసిన బంగాళాదుంపలు-2, పచ్చిమిరపకాయలు-2, అల్లం-టీస్పూను, మిరియాలు- రుచికి సరిపడా, ఉప్పు-తగినంత, గుడ్లు-2, బ్రెడ్‌ ముక్కలపొడి- అర కప్పు, నూనె- ఒక కప్పు.

ఫిష్‌ ఫింగర్స్‌

కావలసినవి: స్నేపర్‌ ఫిల్లెట్స్‌- 750 గ్రాములు (వైట్‌ ఫిష్‌వి), ఉడకబెట్టి, మెత్తగా చేసిన బంగాళాదుంపలు-2, పచ్చిమిరపకాయలు-2, అల్లం-టీస్పూను, మిరియాలు- రుచికి సరిపడా, ఉప్పు-తగినంత, గుడ్లు-2, బ్రెడ్‌ ముక్కలపొడి- అర కప్పు, నూనె- ఒక కప్పు.
 
తయారీ విధానం: పాన్‌ తీసుకుని అందులో చేప ముక్కల్ని వేసి నీళ్లు పోసి, ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. అవి చల్లారాక చేప ముక్కల్లో ముల్లు లేకుండా జాగ్రత్తగా తీసేయాలి. తర్వాత అల్లం, పచ్చిమిరపకాయల్ని బ్లెండర్‌లో వేసి పేస్టులా చేయాలి. పాన్‌లో నూనె పోసి సన్నని మంటపై నూనెను వేడి చేయాలి. ఒక గిన్నె తీసుకుని అందులో చేప ముక్కల్ని, ఉడకబెట్టిన బంగాళాదుంపను మెత్తగా చేసి వేయాలి. అందులోనే అల్లం, పచ్చిమిరపకాయ పేస్టు, కొత్తిమీర ఆకులు, కొద్దిగా మిరియాలపొడి వేసి బాగా కలపాలి. ఉప్పు సరిపోనట్టు అనిపిస్తే కాస్త వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని వాటిని ఫింగర్‌ షేపులో చేసి గుడ్డు సొనలో ముంచి, బ్రెడ్‌ ముక్కల పొడిలో దొర్లించాలి. అలా చేసిన ముక్కల్ని వేడెక్కిన నూనెలో వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేగించాలి. ఫిష్‌ ఫింగర్స్‌ ఎక్కువ నూనెను పీల్చినట్టు అనిపిస్తే పేపర్‌ టవల్స్‌లో వేసి వాటికి పట్టిన అదనపు నూనెను డ్రై చేయొచ్చు. ఈ ఫిష్‌ ఫింగర్స్‌ను టొమాటో కచె్‌పతో తింటే ఎంతో బాగుంటాయి.

Updated Date - 2017-07-08T17:22:47+05:30 IST