గ్రిల్డ్‌ పైనాపిల్‌

ABN , First Publish Date - 2017-04-01T20:47:27+05:30 IST

కావాల్సిన పదార్థాలు పైనాపిల్‌ ముక్కలు- ఒక కప్పు (పొడవుగా కోసుకోవాలి), చక్కెర- మూడు టేబుల్‌ స్పూన్లు,

గ్రిల్డ్‌ పైనాపిల్‌

కావాల్సిన పదార్థాలు
 
పైనాపిల్‌ ముక్కలు- ఒక కప్పు (పొడవుగా కోసుకోవాలి), చక్కెర- మూడు టేబుల్‌ స్పూన్లు, పుదీనా తురుము- రెండు టేబుల్‌ స్పూన్లు, నిమ్మ ఆకుల తురుము- ముప్పావు టీ స్పూను, నూనె- వేగించడానికి సరిపడా, నెయ్యి- ఒక టేబుల్‌ స్పూను.
 
 
తయారీ విధానం
చక్కెర, పుదీనా తురుము, నిమ్మ ఆకుల తురుములను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత నెయ్యి వేసి కలిపి, ఈ మిశ్రమాన్ని పైనాపిల్‌ ముక్కలకు బాగా పట్టించాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నూనె చిలకరిస్తూ ఆ ముక్కల్ని నిప్పుల మీద దోరగా కాల్చుకోవాలి.

Updated Date - 2017-04-01T20:47:27+05:30 IST