లెమన్‌ చికెన్‌

ABN , First Publish Date - 2017-01-31T19:38:15+05:30 IST

కావలసిన పదార్థాలు బోన్‌లెస్‌ చికెన్‌ - 300 గ్రా నూనె - ఒకటిన్నర టే.స్పూను

లెమన్‌ చికెన్‌

కావలసిన పదార్థాలు
 బోన్‌లెస్‌ చికెన్‌ - 300 గ్రా
నూనె - ఒకటిన్నర టే.స్పూను
అల్లం ముద్ద - 1 టీస్పూను
నిమ్మరసం - 2 టీస్పూన్లు
కారం - 3/4 టీస్పూను
ఉప్పు, పసుపు - తగినంత
ఇతర పదార్థాలు:
నూనె - అర టే.స్పూను
అల్లం తరుగు - 1 టే.స్పూను
వెలుల్లి తరుగు - అర టే.స్పూను
పచ్చిమిర్చి - 2
ఉల్లి ముక్కలు - అర కప్పు
షుగర్‌ - అర టీస్పూను
గరం మసాలా - 1 టీస్పూను
సోయా సాస్‌ - అర టే.స్పూను
పుదీనా - గుప్పెడు
 
తయారీ విధానం
మారినేడ్‌లో చికెన్‌లో ఒకటిన్నర గంటపాటు నానబెట్టాలి.
బాండీలో నూనె వేసి అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి.
ఉల్లి ముక్కలు, షుగర్‌, ఉప్పు వేసి ముక్కలు ఎర్రబడేవరకూ వేయించాలి.
తర్వాత చికెన్‌, నిమ్మరసం వేసి సగం ఉడికేవరకూ కలుపుతూ ఉండాలి.
మసాలా పొడి వేసి 2, 3ని.లపాటు వేయించాలి.
సోయాసాస్‌ వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
చివర్లో పుదీనా ఆకు వేసి ఆకులు మెత్తబడేవరకూ ఉడికించాలి.
చికెన్‌ డ్రైగా తయారయ్యేవరకూ చిన్న మంట మీద ఉంచి దింపాలి.

Updated Date - 2017-01-31T19:38:15+05:30 IST