కాలీ ఫ్లవర్ సలాడ్‌

ABN , First Publish Date - 2017-01-07T17:28:42+05:30 IST

కాలీ ఫ్లవర్ సలాడ్‌

కాలీ ఫ్లవర్ సలాడ్‌

కావలసిన పదార్థాలు
కాలీ ఫ్లవర్ - 3 కప్పులు, వేయించిన బాదం పలుకులు - 2 టే.స్పూన్లు, ఉల్లిముక్కలు - పావు కప్పు
ఉడికించిన బఠాణీ - 2 టే.స్పూన్లు
ఉప్పు - తగినంత, మయొనీస్‌ - అర కప్పు
యాపిల్‌ సిడార్‌ వినెగర్‌ - 1 టే.స్పూను

తేనె - పావు కప్పు

తయారీ విధానం

పెద్ద గిన్నెలో నీళ్లు నింపి ఉప్పు వేసి మరిగించాలి.
దీన్లో కాలీ ఫ్లవర్ వేసి 3 ని.లు మరిగించి దించి నీళ్లు వంపేయాలి.
వీటిని వెంటనే చల్లని నీళ్లలో వేసి ముక్కలు చల్లబడిన తర్వాత నీళ్లు వంపేయాలి.
ఈ కాలీ ఫ్లవర్‌కి బాదం పలుకులు, ఉల్లి ముక్కలు, బఠాణీలు చేర్చాలి.
మయొనీస్‌, వెనిగర్‌, తేనె చేర్చి ముక్కల్ని బాగా
తిరగేయాలి.
ఫ్రిజ్‌లో చల్లబరిచి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-01-07T17:28:42+05:30 IST