హోంవంటలుఅదిలాబాద్నాన్వెజ్నాన్వెజ్ టిఫిన్స్ & స్నాక్స్స్టఫ్డ్ మష్రూమ్స్ v id="pastingspan1">కావాల్సిన పదార్థాలు: కరిగించిన వెన్న - 3 టేబుల్ స్పూన్లు, మష్రూమ్స్ - 6, ఉల్లికాడలు (తరిగినవి) - 2, నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్, ఉడికించిన గుడ్డు - 1, ఎండు మిర్చి - 2. తయారీ :మష్రూమ్స్ కాడలు తీసేసి వాటిలో కరిగించిన వెన్న వేయాలి.సన్నని మంట మీద పాన్ ఉంచి అందులో ఒక టీస్పూన్ వెన్న వేయాలి. వెన్న కరిగాక మష్రూమ్స్ వేసి కాసేపు వేగించాలి. మరో పాన్‌లో తరిగిన ఉల్లికాడలు వేసి బాగా వేగించాలి. తరువాత ఎండు మిర్చిని చిన్నముక్కలుగా చేసి వేయాలి. ఉడికించిన గుడ్డును ముక్కలు చేసి ఇందులో కలపాలి. ఆ తరువాత సరిపడా ఉప్పు వేయాలి. బాగా వేగిన తర్వాత పైనుంచి నిమ్మరసం పిండాలి. ఈ మిశ్రమాన్ని మష్రూమ్స్‌కు బాగా పట్టించి పాన్‌లో వేసి సన్నటి మంటమీద పది నిమిషాలు వేగనివ్వాలి. రెడీ అయిన స్టష్డ్ మష్రూమ్స్‌ని వేడివేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!