ఆనియన్‌-ఛీజ్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2015-12-08T14:29:53+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ (పెద్దది) - 1, ఛీజ్‌ క్యూబ్స్‌- 100 గ్రాములు, టొమాటో - 1, పచ్చిమిర్చి - 1 నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర కట్ట - 1, మిరియాల పొడి, ఉప్పు

ఆనియన్‌-ఛీజ్‌ సలాడ్‌

కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ (పెద్దది) - 1, ఛీజ్‌ క్యూబ్స్‌- 100 గ్రాములు, టొమాటో - 1, పచ్చిమిర్చి - 1 నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర కట్ట - 1, మిరియాల పొడి, ఉప్పు - రుచికి తగినంత
తయారుచేసే విధానం: ముందుగా ఉల్లిపాయను చక్రాల్లా కోసి విడగొట్టి వాటిని ఓ ప్లేట్‌లో పెట్టుకోవాలి. అందులో ఛీజ్‌ క్యూబ్స్‌, టొమాటో ముక్కలు వేయాలి. పచ్చిమిర్చి సన్నగా తరిగి అందులో వేయాలి. నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు జత చేయాలి. కొత్తిమీర ఆకులు తెంపి పైన అందంగా అలంకరించి సర్వ్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2015-12-08T14:29:53+05:30 IST