చేపల ఇగురు

ABN , First Publish Date - 2015-11-05T15:33:51+05:30 IST

కావలసిన పదార్థాలు: చేపలు - అరకిలో, ఉల్లిపాయలు - నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్‌ స్పూను, లవంగాలు - ఐదు, దాల్చినచెక్క - రెండు, గసగసాలు - రెండు టీ స్పూన్లు, ధనియాలు

చేపల ఇగురు

కావలసిన పదార్థాలు: చేపలు - అరకిలో, ఉల్లిపాయలు - నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్‌ స్పూను, లవంగాలు - ఐదు, దాల్చినచెక్క - రెండు, గసగసాలు - రెండు టీ స్పూన్లు, ధనియాలు - రెండు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర - అర టీ స్పూను, పసుపు - చిటికెడు, కారం - నాలుగు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, కరివేపాకు - ఒక రెబ్బ, నూనె - సరిపడా, కొత్తిమీర - ఒక కట్ట.
తయారుచేయు విధానం
: లవంగాలు, దాల్చినచెక్క, ధనియాలు, జీలకర్రని మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గసగసాల్ని కూడా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు మిక్సీలో వేసి అందులో గసగసాల పొడి కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి సరిపడా నూనె వేయాలి. బాగా కాగాక కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముద్ద కూడా వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్ప, పసుపు, మసాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు చేప ముక్కల్ని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి సన్నని మంటపై ఉడకనివ్వాలి. ముక్క బాగా ఉడికిన తర్వాత దించేసి కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

Updated Date - 2015-11-05T15:33:51+05:30 IST