మామిడి కాయ పెసరపప్పు పచ్చడి

ABN , First Publish Date - 2015-09-01T22:50:19+05:30 IST

కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు - ఒక కప్పు, పెసరపప్పు - అర కప్పు, ఎండు మిర్చి

మామిడి కాయ పెసరపప్పు పచ్చడి

కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు - ఒక కప్పు, పెసరపప్పు - అర కప్పు, ఎండు మిర్చి - నాలుగు, జీలకర్ర - అర స్పూను, ఉప్పు - రుచికి తగినంత, తాలింపు కోసం - మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి.
తయారుచేసే విధానం: కడాయిలో నూనెపోసి పెసరపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి దొరగా వేగించి, తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలతో కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఈ మిశ్రమానికి తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడిని అన్నంలో నెయ్యితో కలిపి తింటే బాగుంటుంది.

Updated Date - 2015-09-01T22:50:19+05:30 IST