టొమాటో పిజ్జా

ABN , First Publish Date - 2015-08-31T16:39:46+05:30 IST

కావలసిన పదార్థాలు: పిజ్జా బేసులు - 2, టమోటా గుజ్జు - అరకప్పు, టమోటా సాస్‌ - అరకప్పు

టొమాటో పిజ్జా

కావలసిన పదార్థాలు 
 
పిజ్జా బేసులు - 2, టొమాటో గుజ్జు - అరకప్పు, టొమాటో సాస్‌ - అరకప్పు , టమోటాలు (పెద్దవి) - 2, చీజ్‌ (తరిగినది) - ఒకటిన్నర కప్పు మిరియాలపొడి, ఉప్పు- రుచికి తగినంత.
 
తయారుచేసే విధానం
 
టొమాటోలను గుండ్రని ముక్కలుగా కోసి, ఒక పాత్రలోకి తీసుకుని అందులో టొమాటో గుజ్జుని, టొమాటో సాస్‌ని కలపాలి. పిజ్జా బేసుల పైన ఈ పదార్థాన్నంతా పలుచగా సర్దాలి. ఉప్పు వేసి మిరియాలపొడిని చల్లాక చీజ్‌ వేయాలి. బేస్‌ని ఓవెన్‌లో పెట్టి చీజ్‌ కరుగుతుండగా పిజ్జాని బయటకి తీయాలి. ఈ టొమాటో పిజ్జాలని వేడివేడిగా తింటే బాగుంటాయి.

Updated Date - 2015-08-31T16:39:46+05:30 IST